దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు నెమ్మదిగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా తొలి టెస్టు హీరో రోహిత్ శర్మ (14) తక్కువ స్కోరుకే అవుటవగా, వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (58) అర్ధసెంచరీ చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శతకంతో చెలరేగాడు.
శతకం తర్వాత కగిసో రబాడ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన మయాంక్ అగర్వాల్ (108: 195 బంతుల్లో 16×4, 2×6) డుప్లెసిస్‌కి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. ప్రస్తుతం కోహ్లీ, రహానే క్రీజులో ఉన్నారు. 64 ఓవర్లకుగాను భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులుగా ఉంది. కాగా, టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లూ సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడకే దక్కడం విశేషం.