వైరల్ వీడియో: వందేమాతరం రాని విద్యాశాఖా మంత్రి, భారత్ మాతాకి జై అన్నాడు…!.

జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమంలో ఒక మంత్రి తప్పు తీవ్ర విమర్శలకు దారి తీసింది. జాతీయ గీతం కూడా ఒక మంత్రికి రాలేదు. బీహార్‌ లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరి వీడియోను రాష్ట్ర జనతాదళ్ (ఆర్జేడీ) బుధవారం షేర్ చేసింది. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ఆర్జెడి తీవ్ర స్థాయిలో మండిపడింది.

ఆర్జేడీ షేర్ చేసిన వీడియోలో వందేమాతరం పంక్తులను ఎగరగోట్టారు. ఆయన పాడిన గీతం మొత్తం తప్పుల తడకగా ఉంది. 38 సెకన్ల క్లిప్ చివరలో, పిల్లలు “మాతరం” అని చెప్పగా… అతను “భారత్ మాతా కి జై” అలాగే “వందే” అని చెబుతున్నాడు. “అనేక అవినీతి కేసుల్లో నిందితుడైన బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్-జి, ఇంకా ఏమైనా అవమానం మిగిలిందా? మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?” అని ఆర్జెడి ప్రశ్నించింది.