అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజా పుస్తకం ‘ది ప్రామిస్డ్ ల్యాండ్’ వివాదాల దిశగా వెళ్తుంది. కాంగ్రెస్ నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గర్ లోని న్యాయవాది సివిల్ దావా వేశారు. ఈ పుస్తకం ఇందులో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గురించి ప్రస్తావించగా… పుస్తకం నాయకులను అవమానిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసారు.
వారిని వారి అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తున్నందున ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జ్ఞాన్ ప్రకాష్ శుక్లా లాల్గంజ్ సివిల్ కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ కేసు డిసెంబర్ 1 న విచారణకు రానుంది. మన్మోహన్ సింగ్ , రాహుల్ గాంధీ గురించి ఒబామా చెప్పింది అవమానకరమని, దేశ సార్వభౌమత్వంపై దాడి జరిగిందని న్యాయవాది తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ నాయకులకు లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఒబామాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే, యుఎస్ రాయబార కార్యాలయం వెలుపల దీక్ష చేస్తా అన్నారు.