వ్యూహకర్తల జోరు: టీడీపీ-టీకాంగ్రెస్‌లకు ఒక్కరే?

-

గత కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తల జోరు ఎక్కువైంది.. గతంలో అంటే రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు సొంతంగా వ్యూహాలు రచించుకుని ప్రత్యర్ధులకు చెక్ పెట్టేవారు.. కానీ గత పదేళ్ళ నుంచి సెపరేట్‌గా వ్యూహకర్తలని పెట్టుకుని నాయకులు రాజకీయం చేయాల్సిన పరిస్తితి వచ్చింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ పేరు దేశ రాజకీయాల్లో బాగా మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు పీకే.. అనేక పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు.. అలాగే ఆ పార్టీల గెలుపులో కీలకపాత్ర పోషించారు..2019లో ఏపీలో వైసీపీ గెలుపులో పీకేది ప్రత్యేకమైన పాత్ర ఉంది.. వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి.. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో పీకే పాత్ర చాలా ఎక్కువ ఉంది. అయితే ఐప్యాక్ అనే సంస్థని ఏర్పాటు చేసుకుని పీకే వ్యూహకర్తగా పనిచేస్తూ వస్తున్నారు. ఇక అదే ఐప్యాక్‌లో పనిచేసిన వారు.. ఇప్పుడు సెపరేట్‌గా వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు.

ఇదే క్రమంలో అదే పీకే టీంలో పనిచేసిన రాబిన్ శర్మ అనే వ్యూహకర్త..మొన్నటివరకు టీడీపీ కోసం పనిచేశారు.. ఇక తాజాగా పీకే టీం మాజీ సభ్యుడు సునీల్ కానుగోలుతో టీడీపీ ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. ఇక టీడీపీకి వ్యూహకర్తగా సునీల్ వ్యూహకర్తగా పనిచేయనున్నారని సమాచారం. ఇదే సమయంలో సునీల్..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సైతం వ్యూహకర్తగా పనిచేయనున్నారని తెలుస్తోంది.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీతో కూడా సునీల్ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసింది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరమైన విషయం తెలిసిందే.. అందుకే ఈ సారి ఎలాగైనా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.

అయితే ఇటీవల టీఆర్ఎస్ పీకే టీంతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది.. ఇక కాంగ్రెస్ సైతం అదే పీకే టీంలో పనిచేసిన సునీల్‌ని వ్యూహకర్తగా నియమించుకుందని తెలుస్తోంది. ఇక ఇదే సునీల్‌ టీడీపీ వ్యూహకర్తగా పనిచేయనున్నారని సమాచారం. ఇటు ఏపీలో అధికారంలోకి రావడం టీడీపీకి కూడా చాలా ముఖ్యం. మొత్తానికి టీడీపీ-కాంగ్రెస్‌లకు ఒకే వ్యూహకర్త పనిచేయనున్నారని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version