ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు సీట్లు కోసం పోటీ పడటం మొదలైంది. ఏపీలో వైసీపీ, టిడిపిల్లో సీటు కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరిగింది. దీంతో నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. దీని వల్ల అధినేతలు జగన్, చంద్రబాబులకు పెద్ద తలనొప్పి ఎదురవుతుంది. ఇదే క్రమంలో ఒకే ఫ్యామిలీలో కూడా సీటు కోసం గొడవలు పడుతున్నారు.
తాజాగా భూమా ఫ్యామిలీలో సీటు పంచాయితీ మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ ఎప్పటినుంచో రాజకీయాలు చేస్తుంది. భూమా నాగిరెడ్డి, ఆయన ఇద్దరు సోదరులు గతంలో ముఖ్య పాత్ర వహించారు. అయితే నాగిరెడ్డి ముందు ఉంటే ఇద్దరు సోదరులు వెనుక ఉంటూ రాజకీయం నడిపించేవారు. ఇక నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి సైతం రాజకీయంగా సక్సెస్ అయ్యారు. కానీ నాగిరెడ్డి, శోభా ఇద్దరు మరణించారు. అటు ఇద్దరు సోదరులు లేరు.
దీంతో వారి వారసులు లైన్ లోకి వచ్చారు. నాగిరెడ్డి వారసులు భూమా అఖిలప్రియ, మౌనిక రెడ్డి, జగత్ విఖ్యాత్ రెడ్డి..ఇక నాగిరెడ్డి ఒక సోదరుడు వారసుడు భూమా బ్రహ్మానందరెడ్డి, మరో సోదరుడు వారసుడు భూమా కిషోర్ రెడ్డి. అయితే అఖిల..ఆళ్లగడ్డ టిడిపి ఇంచార్జ్ గా ఉంటే..బ్రహ్మానందరెడ్డి నంద్యాల టిడిపి ఇంచార్జ్ గా ఉన్నారు. అటు కిషోర్ ఆళ్లగడ్డ బిజేపి ఇంచార్జ్ గా ఉన్నారు.
అయితే ఇప్పుడు నంద్యాలపై అఖిల ఫోకస్ పెట్టారు. ఇది తన సొంత తమ్ముడు విఖ్యాత్కు దక్కించుకోవాలని చూస్తున్నారు. విఖ్యాత్ సైతం..నంద్యాల నుంచి రాజకీయం మొదలుపెడతానని అంటున్నారు. అటు మౌనిక ఆళ్లగడ్డపై ఫోకస్ పెట్టారు. కిషోర్ కూడా టిడిపిలోకి వచ్చి ఆళ్లగడ్డ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇలా ఒకే ఫ్యామిలీలో సీటు కోసం పోటీ పడుతున్నారు. దీంతో బాబుకు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. చివరికి ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లు ఎవరికి ఫిక్స్ చేస్తారో చూడాలి.