దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల పనితీరుపై చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ మీడియాలో కూడా ఏపీ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్ల పనితీరు చాలా అమోఘమని కథనాలు ప్రసారం చేస్తున్నారు. కరోనా వైరస్ అరికట్టడంలో గ్రామ వాలంటీర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా మందిని ఆకర్షించడం జరిగింది. దీంతో కేరళ ప్రభుత్వం తాజాగా గ్రామ వాలంటీర్ లను చేసుకోవడానికి కూడా ఇటీవల రెడీ అయిన సంగతులు మనకందరికీ తెలిసినదే. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరవేయడానికి వైయస్ జగన్ ఆలోచనల నుండి వచ్చిన వ్యవస్థ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ.
లబ్ధిదారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఎక్కడ గ్రామ వాలంటీర్లు తమ పెన్షన్లను తీసివేస్తారు ఏమో అని భయపడి సోషల్ మీడియాలో తమ బాధలను చెప్పుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మరోపక్క వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార పార్టీకి చెందిన నాయకులు తోసిపుచ్చుతున్నారు. కావాలని గ్రామ వాలంటీర్ లను భయబ్రాంతులకు గురి చేయడానికి విపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అంటూ కొట్టిపారేస్తున్నారు.