మంచు హీరోకి మూడు భాషలు వర్కౌట్ అవుతుందా …?

-

మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు సక్సస్ అయినట్టుగా ఆయన కొడుకులు మాత్రం హీరోలుగా టాలీవుడ్ లో సక్సస్ అవలేదని చెప్పాలి. టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నప్పటికి మంచు విష్ణు కి మాత్రం బ్లాక్ బస్టర్స్ అందుకోలేకపోతున్నాడు. గత రెండేళ్లుగా విష్ణు నటించిన సినిమాలు రాలేదన్న సంగతి తెలిసిందే. చేసిన సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అవుతుండటం తో చాలానే గ్యాప్ వచ్చింది. మంచి ప్రాజెక్ట్ తో వద్దామనుకున్నప్పటికి ఏ ప్రాజెక్ట్ సెట్ అవక సతమతమౌతున్నాడు.

 

అయితే ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విష్ణు “మోసగాళ్లు” అనే సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గత కొంతకాలంగా తెలుగులో సినిమాలేవీ రాకపోవడంతో మంచు విష్ణు కి మార్కెట్ కంప్లీట్ గా పడిపోయింది. అయినా “మోసగాళ్లు” సినిమాను హాలీవుడ్ లో రిలీజ్ చేస్తాను అంటే అందరికి షాక్ తగిలింది. అంతేకాదు విష్ణు ఇంత స్ట్రాంగ్ గా డిసైడయ్యాడంటే పక్కా సినిమా హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు మంచు ఫ్యాన్స్.

ఇక విష్ణు మోసగాళ్లు సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. రెండు సంవత్సరాల క్రితం వరుస ప్లాప్ లతో ఉన్న విష్ణు అమెరికా వెళ్ళి అక్కడ ఇద్దరు హాలీవుడ్ రైటర్స్ ని తీసుకొని ఇండియాలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం గురించి కథ రెడీ చేసాడట. ఆ కథతో కేవలం హాలీవుడ్ డైరెక్టర్ని పెట్టుకొని ఇంగ్లీష్ లోనే విడుదల చేద్దామని అనుకున్నాడట. కాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని తెలుగులో మోసగాళ్లు పేరుతో మొదలుపెట్టారు. ఈ సినిమా ఇంగ్లీష్ తెలుగు హిందీ బాషలలో రిలీజ్ కానున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాను ముందు తెలుగులో రిలీజ్ చేసి ఆ తర్వాత హాలీవుడ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version