స్థానిక సంస్థల ఎన్నికలు అయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు కనబడకుండా గుడ్డలు చుట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో జగన్ ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ ఇచ్చింది హైకోర్టు. మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం వైసిపి పార్టీ రంగులు వేయటాన్ని తప్పుపట్టింది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీ భవనాలకు వైసిపి పార్టీ రంగు తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ కేసు పై దాదాపుగా, 2 నెలల నుంచి వాదనాలు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఈ కేసు పై వాదనలు ముగిసిన తరువాత, కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసి, ఇటీవల తుది తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అలా ఉండడం తప్పు కాదు అనే పిటిషన్ వేసే ఆలోచనలు ప్రభుత్వ లాయర్ తో జరుపుతున్నట్లు సమాచారం. ఈ విధంగా ముందుకు వెళ్తే కచ్చితంగా సాహసోపేతంగా హైకోర్టు కి ఎదురు వెళ్లినట్లే అని అంటున్నారు కొంతమంది న్యాయనిపుణులు.