నాకు మార్గదర్శి, ప్రత్యేక హోదా తప్ప మరో పని లేదు – ఉండవల్లి

-

నాకు మార్గదర్శి, ప్రత్యేక హోదా తప్ప మరో పని లేదన్నారు రాజమండ్రి మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్. మార్గదర్శిపై టిడిపి అధికార ప్రతినిధి బి.వి. రెడ్డితో డిబెట్ కు సిద్ధమని.. రామ్మోజీరావుతోగాని, చంద్రబాబుతో వచ్చిన రెడీ అని సవాల్‌ చేశారు రాజమండ్రి మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్.

రామ్మోజీ ఫిలిం సిటీలోనైనా, టిడిపి కార్యాలయంలోనైనా సిద్ధమని.. నాకు మార్గదర్శి, ఏ.పి. ప్రత్యేక హోదా తప్ప మరో పని లేదని వెల్లడించారు. ఖాళీగానే ఉన్నానని.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యచౌదరికి ఏమి పని ఉంది అని నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏమి చేశామని.. మంత్రి పదవి ఇచ్చినట్లు ఇచ్చి ఏడాదిలోపు పీకేశారన్నారు. గోరంట్ల నువ్వు ఖాళీయే కదా నాతో డిబేట్‌ కు రా అంటూ ఛాలెంజ్‌ చేశారు రాజమండ్రి మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version