తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టడం ఏమోగానీ ఇపుడు సీఎం కేసీఆర్ పై ఆమె చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. రాజకీయంగా తెలంగాణలో కొన్ని పరిస్థితులు ఇప్పుడు మనకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే భావన ఉంది. ఇన్ని రోజులు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసే విషయంలో చాలామంది వెనక్కు తగ్గుతున్నారు.
ఈ తరుణంలో షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడంతో ఆమె వైపు కి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కెసిఆర్ పై విమర్శలు చేయాలని చూసినా సరే రాష్ట్ర పార్టీ నాయకత్వం వారిని వెనక్కు లాగుతుంది. ఈ తరుణంలో కేసీఆర్ ను గట్టిగా టార్గెట్ చేయడం తో కేసీఆర్ పై కోపం ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె వైపు వెళ్లే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
కొంతమంది రెడ్డి సామాజిక వర్గం లో అలాగే కమ్మ సామాజిక వర్గం లో దళిత సామాజిక వర్గాల్లో సీఎం కేసీఆర్ పై ఆగ్రహం ఉంది. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా షర్మిల వైపు తిరిగే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు త్వరలోనే ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక షర్మిల కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు నే బలంగా టార్గెట్ చేయడం ఇప్పుడు కేసీఆర్ కు కలిసి వచ్చే అమాశం.