వాట్సప్‌లో వ్యాక్సిన్ స్టిక్కర్స్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా డౌన్ లోడ్ చేసుకోండి.
వాట్సప్ కొత్తగా వ్యాక్సిన్ ఫర్ ఆల్ స్టిక్కర్స్‌ని రిలీజ్ చేసింది. దీన్ని మనం ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.. ప్రస్తుతం మన దేశంలో 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీనికోసం అనేక ప్రచారాలు కూడా చేసింది. ప్రజల్లో వ్యాక్సిన్ తీసుకోవడంలో సందిగ్ధం చెందకుండా ఈ ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి వాట్సాప్ కూడా వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.
vaccine for all ∙పేరుతో స్టిక్కర్ ప్యాక్ రూపొందించింది. దీన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం రిలీజ్ చేస్తోంది. వాట్సప్ వినియోగదారులందరూ వ్యాక్సిన్ ఫర్ ఆల్ స్టిక్కర్లు ఉపయోగించుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ ఫన్నీగా ఉండటమే కాదు వ్యాక్సిన్ పై అవగాహన పెంచేందుకు ఉపయోగపడతాయి. వీటిని మీరూ డౌన్లోడ్ చేసుకొని మీ స్నేహితులు షేర్ చేయొచ్చు. మరి వాట్సప్‌లో వ్యాక్సిన్ ఫర్ ఆల్ స్టిక్కర్ ప్యాక్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి.
వ్యాక్సిన్ ఫర్ ఆల్ స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ చేసే విధానం
- మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత ఎవరిదైనా ఛాట్ ఓపెన్ చేయండి.
- ఛాట్ బాక్స్‌లో స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
- ఎమొజీ, జిఫ్, స్టిక్కర్ ఐకాన్ కనిపిస్తాయి. అందులో స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
- మీరు ముందే డౌన్ లోడ్ చేసుకున్న స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
- ఆ వరుసలో చివర్లో మీకు కనిపించే + ఐకాన్ పైన క్లిక్ చేయండి. vaccine foe all స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తుంది.
- దీనికోసం డౌన్ లోడ్ పైన క్లిక్ చేస్తే వ్యాక్సిన్ ఫర్ ఆల్ స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ అవుతుంది.
- ఆ తర్వాత మళ్లీ ఎవరిదైనా చాట్ ఓపెన్ చేసి, అందులో స్టిక్కర్ సెక్షన్లోకి వెళ్లండి.
- అప్పుడు మీకు వ్యాక్సిన్ ఫర్ ఆల్ స్టిక్కర్స్ కనిపిస్తాయి.
ఈ స్టిక్కర్ ప్యాక్‌లో మొత్తం 23 స్టిక్కర్స్‌ని వాట్సాప్ రూపొందించింది. ఇవి మాత్రమే కాదు గతంలో కూడా కరోనా పై అవగాహన కల్పించేందుకు స్టిక్కర్ ప్యాక్స్ రిలీజ్ చేసింది వాట్సప్.