వైఎస్ ష‌ర్మిలకు షాక్.. పార్టీ రిజిస్ట్రేష‌న్ పై చిక్కుముడులు

-

ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ కుమార్తే.. వైఎస్ ష‌ర్మిల తెలంగాణ లో పార్టీ స్థాపించిన విష‌యం తెలిసందే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పేరుతో రాష్ట్రంలో ప‌లు కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తుంది. అయితే తాజా గా ఈ పార్టీ చిక్కుముడులు ప‌డిన‌ట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ కాలేద‌ని అన్న‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు తెలిపారు. తాము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు పై పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఎన్నిక‌ల క‌మిష‌న్ కోరామ‌ని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ముహ‌బూబ్ బాషా తెలిపారు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila
వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

అయితే కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంకా రిజిస్ట్రేష‌న్ కాలేద‌ని రాత పూర్వ‌కంగా వివ‌రణ ఇచ్చార‌ని తెలిపారు. కాగ ఈ పార్టీ పై గ‌తంలోనే కేంద్ర ఎన్నికల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసినట్టు వెల్ల‌డించారు. ష‌ర్మిల పార్టీపై ఆలోచిస్తామ‌ని చెప్పార‌ని తెలిపారు. కాగ పార్టీ రిజిస్ట్రేషన్ వ్య‌వ‌హారం పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత‌లు స్పందించారు. త‌మ‌కు కేంద్ర ఎన్నికల క‌మిష‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం రాలేద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news