కూతురు పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న సోనియా

-

జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పడుతున్న బాధల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిజెపిని ఎదుర్కోవడానికి చాలా వరకు కష్టాలు పడే పరిస్థితి వచ్చింది. రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలుగా బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడటంతో ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే నేత అంటూ ప్రత్యేకంగా ఎవరు కనపడటం లేదు. రాహుల్ గాంధీ తనకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వద్దు అని చెప్పుకుంటున్నారు. ఆయనకు ఇవ్వాలని తల్లి సోనియాగాంధీ పట్టుదలగా వ్యవహరించిన సరే ఆయన మాత్రం అందుకు ససేమిరా అనడంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంకు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

priyanka gandhi
priyanka gandhi

మళ్ళీ తిరిగి సోనియాగాంధీని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎంపిక చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం బీజేపీ కి చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో పట్టు పెంచుకునేందుకు గాను కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీని సోనియా గాంధీ రంగంలోకి దించారు. ఉత్తర ఉత్తర ప్రదేశ్ మొత్తం కూడా ప్రియాంక గాంధీనే చూస్తున్నారు. అంతేకాకుండా ఆమెకు కేంద్ర పార్టీలో కొన్ని బాధ్యతలను కూడా సైలెంట్ గా తగ్గించి ఉత్తరప్రదేశ్ మీద ఎక్కువగా దృష్టి సారించాలి అని సూచించారు.

దీనితో క్షేత్రస్థాయిలో ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా నాయకులతో కూడా ఆమె మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ప్రజలతో ఎక్కువగా మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రియాంక గాంధీ విషయంలో అటు బిజెపి కూడా కాస్త అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. హిందుత్వ ఓటుబ్యాంకును ప్రియాంక గాంధీ టార్గెట్ చేశారు ఆ విధంగానే సైలెంట్గా సోషల్ ఇంజనీరింగ్ నీ ఆమె మొదలుపెట్టారట. ఇక ఎస్ పి, బీ ఎస్ పి పార్టీ లలో పదవులు లేని నాయకులను కూడా ఆమె కాంగ్రెస్ లోకి తీసుకుని వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇటీవల కొంతమంది అగ్రనేతలతో కూడా ఆమె సంప్రదింపులు జరిపారు. వారందరూ పార్టీలోకి వస్తే తాను పదవులు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పార్టీ కోసం కష్టపడాలని సూచనలు చేశారని తెలుస్తోంది.

ఆమె ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోనీ ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముందు ఆమె ఎక్కువగా బరేలీ జిల్లా లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేసినా ఆ తర్వాత మాత్రం బీజేపీని దెబ్బకొట్టడానికి రాజధాని లక్నో నగరం అయితే బాగుంటుంది అనే భావనను వ్యక్తం చేశారట. దీనితో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు ప్రియాంకగాంధీకి స్వేచ్ఛ ఎక్కువగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ పార్లమెంటు స్థానాలు చాలా కీలకం. ప్రధానమంత్రి పదవిని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీ ఇప్పుడు కాస్త కంగారు పడుతుంది అంటున్నారు. ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి ఆమె గనుక విజయవంతం అయితే మాత్రం బీజేపీకి చుక్కలు కనబడటం కాదు ఆ ప్రభావం సరిహద్దున ఉన్న ఉత్తరాఖండ్ బీహార్ వైపు కూడా పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news