చర్చనీయాంశంగా మారిన ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల రద్దు !

-

విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్‌ రద్దయింది. గతంలో కోవిడ్ సెంటర్లకు అనుమతి ఇచ్చిన DMHO డాక్టర్‌ రమేశ్ తన పదవీ విరమణ రోజే అనుమతి రద్దు చేశారు. రమేశ్ నాలుగు రోజుల క్రితం పదవీ విరమణ చేశారు. కోవిడ్ సెంటర్లకు అనుమతుల్లో లక్షలు చేతులు మారినట్టు ప్రభుత్వం గుర్తించింది. కరోనా కేంద్రాల నిర్వహణకు అనుమతిచ్చిన అధికారే వాటిని రద్దు చేయడంపై దుమారం చెలరేగింది. విజయవాడలో అన్ని ప్రైవేట్ కోవిడ్ సెంటర్స్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కాయని గుర్తించారు.

 

మొత్తం 22 కోవిడ్ సెంటర్స్‌లోనూ ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని గుర్తించి అనుమతులు రద్దు చేశారని చెబుతున్నారు. డాక్టర్ల బృందం పరిశీలనలో లోపాలు గుర్తించడం వల్లే.. లైసెన్స్ రద్దు చేసినట్టు మాజీ DMHO డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ నిబంధనలు పాటించని సెంటర్లకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కరోనా కేంద్రాల నిర్వహణకు అనుమతిచ్చిన అధికారే వాటి అనుమతిని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news