ఆ ఎంపీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. మ‌రీ ఇంత ఘోరంగానా!

శ్రీరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచ‌ల‌న‌మో అంద‌రికీ తెలిసిందే. ఈ బాంబు ఎప్పుడు ఎవ‌రి మీద పేలుతుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. కాస్టింగ్ కౌచ్‌తో ఒక్క‌సారిగా బాగా ఫేమ‌స్ అయిపోయింది. ఇక అప్ప‌టి నుంచి ఒక్కో యాక్ట‌ర్ మీద‌, కొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టుల మీద సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డుతుంది.

ఇప్పుడు ఈమె ఓ వైసీపీ ఎంపీని టార్గెట్ చేసింది. ఆయ‌నెవ‌రో కాదు ర‌ఘురామ‌కృష్నం రాజు. ఈయ‌న వైసీపీలోనే ఉన్నా.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతుంటాడు. అందుకే ఈయ‌న్ను శ్రీరెడ్డి రీసెంట్గా టార్గెట్ చేస్తూ వీడియోలు పెడుతుంది.

ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో వ్యంగ్యంగా ఫొటోలు పెడుతూ బూతుల‌తో పోస్టులు పెడుతోంది. విచిత్రం ఏంటంటే ఈమె పోస్టుల‌కు స‌పోర్టు చేసేవాళ్లు కూడా ఉన్నారు. దీంతో మ‌రింత రెచ్చిపోతోంది. ఎంపీని తిట్టేందుకు ఓ ట్యాగ్‌లైన్ పెట్టి మ‌రీ వీడియోలు పెడుతోంది. దీనిపై ఎంపీ కూడా స్పందిస్తూ.. వైసీపీ మంచి శృంగార తార‌ను ఎంచుకుంద‌ని విమ‌ర్శించారు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎటువైపు వెళ్తుందో చూడాలి.