బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం విషయంలో ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణం వెనుక మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే ఫ్యామిలీ ఉంది అనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బిజెపి నేత నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేసారు. జూన్ 13 న బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలి ఇంట్లో పార్టీ జరిగింది అని పేర్కొన్నారు.
ఆ పార్టీకి మహారాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి, ఉద్దావ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే కూడా హాజరయ్యారని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆయనతో పాటుగా సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కూడా హాజరయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసుతో థాకరే కుటుంబానికి సంబంధం ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు, రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఈ కేసుని కేంద్రం సిబిఐ కి ఇచ్చింది.