తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. అనంతరం తమిళసై తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం, తెలంగాణ మంత్రులు, ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు హాజరయ్యారు. అంతకుముందు తమిళిసై చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు సీఎం కేసీఆర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా తమిలిసై సౌందరరాజన్ రికార్డు సృష్టించింది. అంతేకాదు ప్రమాణస్వీకారం చేసిన రోజే మంత్రివర్గ ప్రమాణస్వీకారం చేయించే అరుదైన అవకాశం పొందడం మరో విశేషం. అంతేకాదు మంత్రివర్గంలో తొలి తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌లో ప్రమాణ స్వీకారం చేయడం మరో విశేషం.
బేగంపేటలో ఘనస్వాగతం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. మొదట శంషాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, బీజేపీ నేతలు తదితరులు స్వాగతం పలికారు.