కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని.. కేసీఆర్ అవినీతిలో కూరకుపోయారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ పై స్పందిస్తూ.. ఆయన టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణలను లూటీ చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మెన్న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు కూడా టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు.