జమిలి ఎన్నికలకు ఎన్ని పార్టీలు మద్దతిచ్చాయి..? టీడీపీ, వైసీపీ స్టాండ్ ఏంటి..?

-

జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోద్రం తెలిపింది..దీంతో ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా విసృతంగా చర్చ నడుస్తోంది.. ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమని.. ఆచరణ సాధ్యంకాదని చెబుతున్నాయి.. అయితే కోవిద్ కమిటీ అందజేసిన నివేదికలో ఏముంది..? మద్దతిచ్చిన పార్టీలెన్ని..? టీడీపీ, వైసీపీ స్టాండ్ ఏంటి..? ఇప్పుడు చూద్దాం..

tdp ysrcp

2027 చివర్లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి కోవిద్ కమిటీ రాష్టపతి కి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి.. జమిలికి 32 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినట్లు రామ్ నాథ్ కోవిడ్ కమిటీ తెలిపింది.. జిమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై గతంలో వివిధ పార్టీలతో చర్చలు జరిపిన సమయంలో మొత్తం 47 పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసాయని వివరించింది.. అందులో 32 పార్టీలు జెమినీ ఎన్నికలకు మద్దతిస్తే.
15 పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు వెల్లడించింది..

జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ, ఆప్, బీఎస్పీ సిపిఎం ఏకకాలంలో జరిగే ఎన్నికలను వ్యతిరేకించగా.. బిజెపి, ఎన్సీపీలు మద్దతు ఇచ్చినట్లు.. మార్చిలో ద్రౌపది ముర్ముకు ఇచ్చిన రిపోర్టులో కోవిడ్ కమిటీ పేర్కొంది.. జమిలి ఎన్నికల వల్ల వనరుల ఆదా, సామాజిక సామరస్యం, ఆర్దికాభివృద్ది సాధ్యమవుతుందని మద్దతు ప్రకటించిన 32 రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయట. అయితే వ్యతిరేకిస్తున్న పార్టీల అభిప్రాయం మరోలా ఉందని తెలుస్తోంది..

ఎన్నికల వ్యూహాలు, ఖర్చులతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేవని మెజార్టీ పార్టీల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.. దీని వల్ల ప్రాథమిక రాజ్యాంగ స్వరూపం దెబ్బ తినడం, ప్రజాస్వామ్య సమాఖ్య భావనకు విఘాదం కల్గుందని వ్యతిరేకించే పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.. విశాల భూభాగం, అత్యధిక జనాభా కల్గిన భారతదేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యమని బీఎస్పీ వంటి పార్టీ తమ అభిప్రాయాన్ని తెలిపిందట.. తెలుగు రాష్ట్రాలలో టిఆర్ఎస్, వైసిపి, టిడిపి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేదని కోవిద్ కమిటీ తెలిపింది.. దేశ పాలన విధానాలలో క్లిష్టమైన సంస్కరణల అమలుపై చర్చించేందుకు 2019లో 19 పార్టీలు సమావేశమవ్వగా.. అందులో 16 పార్టీలు.. జమిలికి మద్దతు ప్రకటించాయని.. అప్పుడు మద్దతు ఇచ్చిన పార్టీలో వైసిపి బీఆర్ఎస్ ఉన్నాయని వెల్లడించింది.. మొత్తంగా జమిలి ఎన్నికలు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారాయి..

Read more RELATED
Recommended to you

Latest news