ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో టీడీపీకి ఎక్కువ శాతం మంచి ఫలితాలే వచ్చాయి. కానీ గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ భారీగా దెబ్బతింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలాంటి పరిస్తితుల్లో ఉన్న టీడీపీ మూడున్నర ఏళ్ళు అయిన అనుకున్న మేర పికప్ అయినట్లు కనిపించడం లేదు.జిల్లాలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు నడవటం వల్ల టీడీపీకి డ్యామేజ్ అవుతుంది. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు పూర్తి పాజిటివ్ ఏమి కనిపించడం లేదు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ విఫలమవుతుంది. జిల్లాలో పలు స్థానాల్లో టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. కళ్యాణదుర్గం సీటులో వైసీపీకి పాజిటివ్ లేదు..కానీ అక్కడ టీడీపీకి కూడా పాజిటివ్ కనిపించడం లేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే హనుమతరాయ చౌదరీ, టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
అటు ధర్మవరం సీటులో పరిటాల శ్రీరామ్ ఉన్నారు గాని..అక్కడ బీజేపీ నేత వరదాపురం సూరి టీడీపీలోకి వచ్చి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇరు వర్గాలకు పడటం లేదు. ఇటు శింగనమలలో బండారు శ్రావణికి చెక్ పెట్టాలని కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. అలాగే పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డికి చెక్ పెట్టాలని జేసీ ఫ్యామిలీ చూస్తుంది. ఆ సీటుని తమ అనుచర నేతకు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.
ఇక మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిలకు పడటం లేదు. అనంతపురం అర్బన్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ, జేసీ ఫ్యామిలీకి పడని పరిస్తితి. ఇలా కంచుకోట లాంటి జిల్లాలో రగడ నడుస్తోంది. దీని వల్ల జిల్లాలో టీడీపీకి మళ్ళీ డ్యామేజ్ జరిగేలా ఉంది.