ఆరోజు కేసీఆర్‌ను చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి : హరీశ్ రావు

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్‌ దీక్ష చేసినప్పుడు ఆయన్ను చూస్తే నాకు ఏడుపొచ్చింది.

అప్పటికీ కేసీఆర్ నిరాహార దీక్ష చేసి 11 రోజులైంది. కంట్రోల్‌లో లేడు, వణుకుతున్నాడు, కానీ పట్టుదల మాత్రం వీడలేదు.అప్పుడు ఆయనను చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి సెంట్రల్ హోంమినిస్టర్ చిదంబరం కాల్ చేసి కేసీఆర్ మీరు దీక్షవిరమించాలని కోరినా.. ఆయన నమ్మలేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే దీక్ష విడుతానని చెప్పాడని హరీశ్ రావు గుర్తుచేశారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version