తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి..రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆయన అభిమానులు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, కీలక నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజాగా తన తండ్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం.తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు.ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు’ అని వెల్లడించారు.