నేటి నుంచి తిరుపతిలో అంతర్జాతీయ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్‌పో..

-

తిరుపతిలో నేటి నుంచి అంతర్జాతీయ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్‌పోను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు.

దేశంలోని దేవాలయాల పరిరక్షణ, వాటి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ ఎక్స్ పోలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు ఎన్ని? వాటి నిర్వహణ, ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు,భక్తుల విరాళం రూపంలో వస్తున్న ఆదాయం, వాటిని అభివృద్ధికి ఎలా ఖర్చు చేయాలనే అంశాలపై ముగ్గురు సీఎంల మధ్య ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version