ఇది దీక్షల టైమా… సేవల టైమా?

-

ధర్నాలు చేయడం, దీక్షలకు కూర్చోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కే! కాదనేవారు ఎవరూ లేకపోవచ్చు… కానీ దానికంటూ ఒక సమయం, సందర్భం ఉండాలనేది మాత్రం కనీస ఆలోచన! ఆలోచన మరిచారో లేక సమయం, సందర్భంగా ముఖ్యంకాదు.. రాజకీయాలే ముఖ్యం అనుకున్నారో తెలియదు కానీ… వరుసపెట్టి టీడీపీ నేతలు 12 గంటల దీక్షలకు కూర్చుంటున్నారు! వారి సంగతి అలా ఉంటే… ఇంతకూ ఈ దీక్షల సంగతి అధినేత చంద్రబాబుకు తెలిసే జరుగుతున్నాయా? లేక పెద్దయన ఊరిలో లేరని ఎవరి సొంత నిర్ణయాలు వారే తీసుకుంటున్నారా అనేది పెద్ద ప్రశ్నే! ఎందుకంటే… ఈ సమయంలో చంద్రబాబు ఇలా ఆలోచిస్తారని అంటే ఆయన ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు మరి!

మొన్నటికి మొన్న… పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు… 12 గంటల దీక్షకు కూర్చున్నారు! ప్రతీ కుటుంబానికి రూ. 5వేల ఆర్ధిక సాయాన్ని అందించాలని, రైతులను ఆదుకోవాలని! దానివల్ల ఆయన సాధించిందేమిటి అనే సంగతి అలా ఉంచితే… అప్పుడే చంద్రబాబు ఖండించలేదని భావించారో లేక, ఆయనకూ అనుమతి వచ్చిందో ఏమో కానీ… తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు 12 గంటల నిరాహారదీక్షకు దిగారు. ఈ సమయంలో ఆయనది కూడా సేం కండీషన్… ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించడం… రైతులను ఆదుకోవడం.

ఈ సమయంలో ఎవరికి తోచిన మేరకు వారు ప్రజలకు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయాలి… తిండిలేనివారికి బియ్యం – కాయగూరలు – నిత్యావసర సరుకులు ఎలా అందించాలి అనే ఆలోచన చేయడం మానేసి… ఇలా 12 గంటల దీక్షలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించి జగన్ రాజకీయంగా ఆలోచిస్తున్నారని కామెంట్స్ చేస్తున్న టీడీపీ నేతలు చేస్తున్న వీటిని ఏమనాలి??

Read more RELATED
Recommended to you

Exit mobile version