టీడీపీ మేనిఫెస్టో రెడీ..ముందస్తు ప్లాన్‌తోనే.!

-

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని..సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి..డిసెంబర్ లో ఎన్నికలు జరిగేలా స్కెచ్ వేస్తున్నారని ప్రచారం నడుస్తుంది. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ లోనే జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటే..ఏపీ ఎన్నికలు కూడా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు  తెలుస్తుంది.

ఇక జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అందుకు  తాము రెడీగా ఉన్నామని ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు అంటున్నారు. ఇక ముందస్తుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు..అభ్యర్ధులని సైతం ప్రకటించుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే వైసీపీకి చెక్ పెట్టేలా పొత్తులు కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే జనసేనతో కలవడానికి రెడీ అయిపోయారు. టి‌డి‌పి, జనసేన కలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎన్నికల్లో ప్రజలని ఆకట్టుకునేలా టి‌డి‌పి మేనిఫెస్టో కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని తెలిసింది.

ఇక ఈ నెలలో జరిగే మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు జరుగుతున్న విషయం తెలిసిందే. మహానాడుని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు  టి‌డి‌పి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. తాజాగా మహానాడు నిర్వహణపై అచ్చెన్నాయుడు టి‌డి‌పి నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విజయదశమికి టి‌డి‌పి మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

అలాగే ముందస్తు ఎన్నికలు ఖాయమని, ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు వస్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు అందరూ సిద్ధం ఉండాలని,  వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేసి టీడీపీకి ఘన విజయం సాధించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మొత్తానికి టీడీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version