ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరణ.. వీడియో కాల్ లైవ్ లో యువకుడి ఆత్మహత్య

-

లైవ్ వీడియో కాల్ లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ప్రేమ వివాహానికి ఇంట్లో వాళ్ళు నిరాకరించడంతో సాంబరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ లో ఓ జువెలరీ షాప్ లో ఉద్యోగం చేస్తున్నాడు సాంబరాజు అనే యువకుడు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. బేగంపేట్ లోని స్టే ఇన్ హోటల్ లో రూమ్ లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

హోటల్ నుంచి ఇంట్లో వాళ్లకు వీడియో కాల్ చేసి లైవ్ లో సూసైడ్ చేసుకున్నాడు సాంబరాజు. ఉప్పల్ నుంచి బేగంపేట వచ్చి చూసేసరికి సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు సాంబ రాజు. దీంతో వెంటనే హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version