బెంజ్ కారే కాదు, కంప్యూటర్ లో కూడా మంత్రి ఇరుక్కుపోయారా…?

-

కార్మిక శాఖ మంత్రి జయరాంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసారు. ఆయన తనయుడు ఈశ్వర్ అవినీతి పై నేను ఆధారాలతో బయట పెట్టానని అన్నారు. ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్రం లో అవినీతి జరిగితే క్షమించను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఎం అయ్యారని నిలదీశారు. అవినీతి పై ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారని అన్నారు.

ఇదివరకే నేను కాల్ సెంటర్ కి ఫోన్ చేసి పిర్యాదు చేసాను …ఇంతవరకు స్పందన లేదన్నారు. ఈ ఎస్ ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తో మంత్రి, ఆయన తనయుడు ఫోటో ఎందుకు దిగారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవలసింది పోయి మంత్రి ని కాపాడాలని చూస్తున్నారని అన్నారు. అచ్చంనాయుడు ని ఆధారాలు లేకుండా అక్రమం గా అరెస్టు చేశారని, మేము అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు చూపిస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ ఎస్ ఐ నిధులను ఎం చేస్తున్నారో తెలియడం లేదని, 450 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాలి అని, ఏ సి బి పై మాకు నమ్మకం ఉందని అన్నారు. రెండు కోట్ల తో కొన్న కంప్యూటర్లు ఎక్కడా ఉన్నాయో మంత్రి చెప్పాలని కొత్త డిమాండ్ తీసుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Exit mobile version