ఆదాల దెబ్బకు సైలెంట్ అయిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి.. ఓటమి తప్పదా..??

-

రాజకీయాల్లో వివాద రహితులు, రాజకీయ చతురత కలిగిన నెల్లూరు వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి దెబ్బకి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైలెంట్ అయ్యారు.. నిన్న మొన్నటి వరకు చేరికల డ్రామా ఆడిన ఆయన.. ఆదాల స్పీడ్ అవడంతో ఏమి చెయ్యాలో ఆయనకు అర్ధం కావడం లేదు.. దీంతో గత వారం రోజులుగా రాజకీయ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి.. తన సొంత ఇమేజ్ కోసం కార్యక్రమాలు చేశారు తప్ప.. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదని నియోజకవర్గంలోని ప్రజలు మండిపడుతున్నారు.. శ్రీధర్ రెడ్డి మరోసారి గెలిస్తే రూరల్ నియోజకవర్గంలో రౌడీలు రాజ్యమేలుతారని.. నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారట..

ఆదాల ప్రభాకర్ రెడ్ది చేస్తున్న రాజకీయానికి కోటంరెడ్డికి చెమటలు పడుతున్నాయట.. వైసీపీలో ఉన్న వారిని బలవంతంగా కోటంరెడ్డి టీడీపీలోకి చేర్చుకుంటూ ఉంటే.. వారు సాయంత్రం కల్లా తిరిగి వైసీపిలో చేరుతున్నారు.. వైసీపీలోనే ఉంటామని చెబుతున్నారు. మరోపక్క టీడీపిలో దీర్ఘకాలంగా ఉన్న మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆడాలకు జై కొడుతూ ఉండటం కోటంరెడ్డి భయానికి కారణమాట.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదని తన అనుచరులు వద్ద కోటంరెడ్డి చెబూతున్నారట..

ఇటీవల కోటంరెడ్డి టీం చేసిన సర్వేలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయాని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.. గ్రామాల్లో కోటంరెడ్డికి గ్రాఫ్ బాగా తగ్గిపోయిందట.. అయన గెలిస్తే గ్రామాల్లో ఘర్షణలు ఎక్కువగా జరుగుతాయని.. అభివృద్ధి ఏమి ఉండదనే భావనలో ప్రజలు ఉన్నారట.. దానికి తోడు సంక్షేమ పథకాలు కుడా ఆగిపోతాయని బయపడుతున్నారట.. దింతో కోటంరెడ్డిని పక్కకి నెట్టేసి అదాలకి అవకాశం ఇవ్వాలని ఓటర్లు భావిస్తున్నట్లు సర్వేలో రావడం తో కోటంరెడ్డి ఆందోళనలో ఉన్నారని అయన అనుచరులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news