అసంతృప్తిలో విశాఖ టిడిపి నేతలు.. చంద్రబాబు న్యాయం చేస్తారా..?

-

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది.. ఎప్పటిలాగే ఉత్తరాంధ్ర ముఖ ద్వారం గా ఉన్న విశాఖపట్టణం టిడిపి నేతలను అక్కున చేర్చుకుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ విశాఖలో మాత్రం.. కాలర్ ఎగరెసింది. 2024 ఎన్నికల్లో కూడా అభ్యర్థిని చూడకుండా.. ఇక్కడి ప్రజలు బలంగా టిడిపికే ఓటేశారు.. ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నం ఆ పార్టీకి కంచు కోటగా మారిపోయింది.. ఏజెన్సీలోని రెండు అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటు మినహా మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.. అలాంటి విశాఖలో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది..

తెలుగుదేశం పార్టీని ఇంతలా ఆదరించిన విశాఖలో ఆ పార్టీ నాయకులు మాత్రం యాక్టీవ్ గా కనిపించడం లేదు. విశాఖ అర్బన్ జిల్లా అలాగే రూరల్ జిల్లా నుంచి ఎవరికీ పదవులు దక్కకపోవడం అందుకు కారణమని తెలుస్తోంది.. ఈసారి సీనియర్ కు కాకుండా కొత్త మొఖాలకి చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సీనియర్లకి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో బెడిసికొట్టింది. ఈసారి ఎన్నికల్లో కూటమి నుంచి రాజకీయ ఉద్దండులే విజయం సాధించారు. ఇవే చివరి ఎన్నికలు అనుకునే వారే ఈసారి గెలుపొందారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో తమకి మంత్రి పదవులు వస్తాయని భావించిన వారికి చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో వారంతా అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది..

పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితకు హోం మంత్రి, నర్సీపట్నం కి చెందిన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ గా చంద్రబాబు అవకాశం కల్పించారు. అర్బన్ జిల్లా నుంచి మంత్రిగా అవకాశం దొక్కుతుందని భావించిన గంటా శ్రీనివాసరావుకి మొండి చెయ్యే మిగిలింది. మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి కూడా అంతే. వీరితోపాటు గాజువాక చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్, విశాఖపట్నం నియోజకవర్గ నుంచి గెలిచిన గణబాబు కూడా గణ బాబుకు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిలో ఉన్నారట..మొత్తంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విశాఖజిల్లాలో నేతల అసంతృప్తిని చంద్రబాబు ఎలా చల్లారుస్తారో చూడాలి మరి

Read more RELATED
Recommended to you

Exit mobile version