టీడీపీకి చుక్కలు చూపిస్తున్న ఫేస్బుక్ ఫేక్ అకౌంట్స్…!

-

ఆంధ్రప్రదేశ్ లో మనుగడ కోసం నానా కష్టాలు పడుతూ రాజకీయం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఒక్కో ఇబ్బందిని ఎదుర్కొంటూ ముందుకి వెళ్తున్న ఆ పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. రాజకీయంగా కూడా బలం పెంచుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలను వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక్కడే ఆ పార్టీని కొన్ని పరిణామాలు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఇప్పుడు సరికొత్త ఇబ్బందులు పడుతుంది.

అది ఏంటీ అంటే… ఫేక్ అకౌంట్స్. చంద్రబాబు నుంచి కార్యకర్తల వరకు ఫేక్ అకౌంట్స్ కనపడుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, లోకేష్‌, సబ్బంహరి, టీడీ జనార్దన్‌, సాయిబాబా, కుటుంబరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌‌ ఇలా చాలా మంది నేతల పేర్లతో ఫేస్బుక్ లో అకౌంట్స్ దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు వీటిని గుర్తించే పనిలో పడింది టీడీపీ సోషల్ మీడియా విభాగం. కొంత మంది కార్యకర్తలు అత్యుత్సాహం తో కూడా వీటిని ఓపెన్ చేస్తున్నారు.

వీటికి ఫ్రెండ్ రిక్వస్ట్ లు కూడా భారీగానే వెళ్తున్నాయి. ఇక ఆ ఖాతాలకు పాపులారిటి రాగానే ఏమైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా అనేది కొందరి ఆవేదన. ఇప్పటికే కొన్ని కొన్ని పరిణామాలు ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఈ తరుణంలో ఫేక్ అకౌంట్స్ ద్వారా సరికొత్త సమస్యను ఎదుర్కొంటుంది అధిష్టానం. అటు నారా లోకేష్ కూడా ఈ విషయంలో నేతలకు పలు సూచనలు కూడా చేస్తూ వచ్చారు. వాటిల్లో టీడీపీ కార్యకర్తలను మాత్రం యాడ్ చేసుకుంటున్నారు. దీనితో ఎం జరుగుతుందో అర్ధం కాక టీడీపీ కంగారు పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news