సీమలో ‘సైకిల్’ అస్సాం!!

-

రాబోయే ఎన్నికలలో వైసీపీని గద్దె దించి టిడిపి అధికారంలోకి రావాలని తన వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తుంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఎలా ఉన్నా రాయలసీమలో మాత్రం టిడిపి వెనకబడే ఉందని విశ్లేషకులే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా అంటున్నారు. రాయలసీమ వైసిపికి కంచుకోట. 2019లో రాయలసీమలోని 52 నియోజకవర్గాలకు గాను టిడిపి మూడు మాత్రమే గెలుచుకుంది.  ఈ సారి రాయలసీమలోని 52 నియోజకవర్గాలలో టిడిపి కనీసం 20 నియోజకవర్గాలన్న గెలుచుకోవాలని చూస్తుంది.

టిడిపి అభిమానులు, స్థానిక నేతలు రాయలసీమలో చాలామంది ఉన్నారు. కానీ వాటిని ఓట్లుగా మలిచే నాయకులు మాత్రం లేరు. ఉన్న నాయకులలో సఖ్యత లేదు, వారి మధ్య ఉన్న ఆదిపత్య పోరు, వర్గ పోరు రాయలసీమలో టిడిపికి నిరాశను మిగులుస్తున్నాయి.  చిత్తూరు జిల్లాలలో 14 సీట్లలో 4 సీట్లు టిడిపి గెలిస్తే కష్టమే అంటున్నారు. అనంతపురంలో 14 స్థానాలకు 7 గెలుస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కడప, కర్నూల్ లో దారుణమైన పరిస్థితి ఉంది. పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటన లో జరిగిన గొడవ వలన అక్కడి నేతలపై పెట్టిన కేసుల వలన పార్టీ కోసం బయటకు వచ్చెందుకు కార్యకర్తలు నేతలు కూడా వెనకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు.

అనంతపురంలో జెసి, పరిటాల, పయ్యావుల వంటి సీనియర్ నాయకులు ఉన్న వారి మధ్య సఖ్యత లోపించటం, ఒకరి నియోజకవర్గంలో పై మరొకరు దృష్టి పెట్టడం వంటి విషయాల వల్ల టిడిపి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతుంది. కర్నూలులో బలమైన నాయకులు ఉన్నా ఇప్పటివరకు పోటీ చేసే అభ్యర్థి పేరు టిడిపి ప్రకటించలేకపోతోంది.

ప్రజలలో  వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉన్నా వాటిని ఓట్లుగా మార్చే నాయకులే టిడిపి కి కరువయ్యారు. ఇప్పటినుంచైనా రాయలసీమపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే 52 స్థానాలలో పూర్తిగా కనీసం 15 సీట్లు అయినా గెలుచుకోవచ్చు..లేదంటే అస్సామే.

Read more RELATED
Recommended to you

Exit mobile version