బడ్జెట్ నా అదృష్టం..!

-

తెలంగాణా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం తన అద్రుష్టంగా భావిస్తున్నా అని తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. 2020-21 బడ్జెట్ ని ఆయన తెలంగాణా శాసన సభలో ప్రవేశ పెడుతున్నారు. ఆర్ధిక మంత్రిగా తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలు రూపొందిస్తున్నామని అన్నారు.

కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గిందని అన్నారు. రెవెన్యు శాఖలో 103.5 కోట్ల మిగులు ఉందని హరీష్ రావు తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్ర వృద్ది రేటు గత ఏడాది నుంచి తగ్గుతుంది అన్నారు. గత ఏడాది రెవెన్యు వృద్ది రేటు… 16 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది అన్నారు. రాష్ట్రానికి జిఎస్డీపీ 12.6 శాతం తగ్గిందని అన్నారు హరీష్ రావు. రైతు బంధు పథకానికి 12 వేల కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రం ప్రగతి శీల రాష్ట్రంగా వృద్ది చెందుతుందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే జిఎస్టీ నిధులు సకాలంలో రావడం లేదని అన్నారు. తెలంగాణకు పన్నుల ఆదాయం తగ్గిందని అన్నారు ఆయన. రైతు బంధు పథకాన్ని ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ప్రధాని కూడా ఈ కార్యక్రమాన్ని చూసే రైతులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారని హరీష్ ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news