వరంగల్, కరీంనగర్ కి గుడ్ న్యూస్…!

-

ఉన్నత విద్యాశాఖకు  1,723 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని  తెలంగాణా  ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణా ప్రభుత్వ బడ్జెట్ ని ఆయన నేడు శాసన సభలో ప్రవేశ పెట్టాయి. వైద్య రంగానికి 6,186 కోట్లు కేటాయించామని చెప్పారు హరీష్. విద్యుత్ శాఖకు 10,416 కోట్లు కేటాయిస్తున్నామని, విద్యుత్ డిమాండ్ ని సమర్ధంగా అధిగమిస్తున్నాం అన్నారు. 24 గంటల విద్యుత్ ని సమర్ధవంతంగా అందిస్తున్నామని చెప్పారు.

పారిశ్రామిక రంగానికి 1,998 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు 1,500 కోట్లు కేటాయించామని చెప్పారు హరీష్. వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు ఐటి విస్తరణ జరుగుతుందని అన్నారు. ఆర్టీసి వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆర్టీసి కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హరీష్ రావు అన్నారు. రైతు రుణ మాఫీ కోసం 1,198 కోట్లు కేటాయించామని హరీష్ రావు వివరించారు.

పట్టణ మిషన్ భగీరధ కార్యక్రమానికి 800 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. తెలంగాణా పచ్చగా ఉండాలని తెలంగాణా ప్రభుత్వం… హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణా దేవాలయాలకు ప్రత్యేక గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, దేవాలయాల మీద ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణ సిద్దం చేసామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news