తీన్మార్ మల్లన్నను బీజేపీలోకి ఘనంగా ఆహ్వానిస్తాం- ఎంపీ అరవింద్

-

తెలంగాణలో కీలక నాయకులను చేర్చుకుని మరింత బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఈ దశలోనే ఇటీవల తీన్మార్ మల్లన్న బీజేపీ చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పార్టీ పరంగా న్యాయ సహాయం అందించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈనేపధ్యంలోనే ప్రస్తుతం జైలుతో ఉన్న తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ ఎంపీ డీ. అరవింద్ కలిశారు.

Arvind_BJP_MP

చంచల్ గూడ జైలుకు వెళ్లి మల్లన్నతో ములాఖత్ అయ్యారు. అనంతరం మల్లన్న పరిస్థితిపై, ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు మల్లన్నను మానసికంగా వేధిస్తున్నారని విమర్శించారు. 37 రోజులుగా మారుమూల సెల్ లో మల్లన్నను ఒంటరిగా ఉంచుతున్నారన్నారు. జైలు అధికారులు మల్లన్నను ఉగ్రవాదిలా చూస్తున్నారని విమర్శించారు. జైలు నుంచి విడుదల తర్వాత తీన్మార్ మల్లన్నను ఘనంగా బీజేపీలోకి ఆహ్వానిస్తామని అరవింద్ తెలిపారు. మల్లన్నను బీజేపీలో చేర్చుకోవాలని కేంద్ర నాయకత్వం తెలిపిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news