”దిశ” యాప్‌ పై సిఎం జగన్ కీలక ఆదేశాలు

-

దిశ యాప్ అమలుపై సీఎం వైయస్‌.జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలని పేర్కొన్నారు సీఎం జగన్. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్‌ డౌన్లోడ్‌ కావాలని సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు. అమ్మాయిల పై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

శరవేగంగా బాధితులను ఆదుకోవాలని వెల్లడించారు సీఎం జగన్. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలని.. ఘటన జరిగిన నెల రోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఎట్టి పరిషితుల్లో బాధితులకు న్యాయం జరగాలని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news