తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 19 న మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి సీఎం కేసిఆర్ నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం రాజ్ భవన్ లో సీఎం కేసిఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ గురించి సీఎం కేసిఆర్ గవర్నర్ తో చర్చించారు. తర్వాత ప్రభుత్వము మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా ప్రకటించింది. అయితే ఎంతమందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ 10 నుంచి 15 మందికి కేబినెట్ లో స్థానం ఇవ్వనున్నట్టు సమాచారం. కేబినెట్ లో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై సీఎం కేసిఆర్ ఇప్పటికే పార్టీ నేతలతో డిస్కస్ చేశారు.
పాత మంత్రులకు నో చాన్స్….
పాత మంత్రులకు ఈసారి మొండి చేయేయని తెలుస్తోంది. కొంతమంది పాత మంత్రులతో పాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించనున్నారు. జిల్లాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసిఆర్ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది.