బ్రేకింగ్: రెవెన్యూ కోర్ట్ లు రద్దు చేసిన తెలంగాణా

-

తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ కోర్టులు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్‌ఒఆర్‌ – 2020 చట్టంతో రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి తేలకుండా రెవెన్యూ కోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగడంతో పాటుగా… క్షేత్ర స్థాయిలో భూ వివాదాలు పెరుగుతున్న నేపధ్యంలో దీనిపై తెలంగాణా సర్కార్ దృష్టి పెట్టింది.

వేగంగా, పారదర్శకంగా తీర్పులు ఇచ్చేలా రెవెన్యూ కోర్టుల స్థానంలో ల్యాండ్‌ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం (ఆర్‌ఒఆర్‌) కింద తహసీల్దారు, ఆర్డీవో, సంయుక్త కలెక్టర్లు (ప్రస్తుతం అదనపు కలెక్టర్లు) రెవెన్యూ కోర్టులను నిర్వహించే వారు.

ఆ పైన భూపరిపాలన కమిషనర్‌, రెవెన్యూ మంత్రి వరకు అప్పీళ్లకు అవకాశం ఇచ్చే వారు. భూ వివాదాల్లో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేయడం, తీర్పులు ఇచ్చి వివాద పరిష్కారం చేసే అధికారాలు దిగువ స్థాయిలో ఉండటంతో… తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్‌ వరకు ఉన్న కోర్టుల్లో పలు రకాల కేసుల విచారణ తేలడం లేదు. దీనిని గమనించిన కేసీఆర్ సర్కార్… పరిష్కారం లేక కోర్ట్ ల చుట్టూ తిరగడంతో చివరికి అప్పీళ్లకు పై కోర్టులను ఆశ్రయిస్తున్నారని గుర్తించి… తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్‌ వరకు ఉన్న కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news