తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు 60 స్థానాలు అవసరం. ఇప్పటికే గెలుపొందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుంటున్నారు. మరో వైపు పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు సేకరించనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్ఠానానికి పంపిన తర్వాత సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
తేలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశం సోమవారం జరుగనున్నది. సోమవారం సాయంత్రానికి తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సమాచారం. ఇక, ప్రమాణ స్వీకారం గురించి రేవంత్ తెలంగాణ డీజీపీకి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, మంత్రుల ప్రమాణానికి ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేశ నలుమూలల నుంచి వీఐపీలు వస్తారని ఈ నేపథ్యంలో తగిన భద్రతపై డీజీపీతో చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే రేపు ఉదయం గాంధీభవన్‌లో సీఎల్పీ నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. అయితే, సీఎం కాన్వాయ్ లేకుండానే కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లడం విశేషం.