కేసీఆర్ ప్రధాని.. కేటీఆర్ సీఎం.. జోస్యం చెప్పిన అలీ

-

కశ్మీర్ కు చెందిన కొందరు ప్రముఖులు తనను కలవడానికి వచ్చినప్పుడు.. కేసీఆర్ ప్రధాని అయి ఉంటే… కశ్మీర్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేసినట్లు చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలను శాసించే సత్తా ఉందని తెలంగాణ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందన్న అలీ… పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు.

మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల పని అయిపోయిందని… దేశ వ్యాప్తంగా ఇక ప్రాంతీయ పార్టీలే సత్తా చాటుతాయని అలీ స్పష్టం చేశారు.

బీజేపీ అసత్యపు ప్రచారాలు చేస్తోందని.. తెలంగాణలో బీజేపీని బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ముస్లింలను గౌరవిస్తున్నారన్నారు. కశ్మీర్ కు చెందిన కొందరు ప్రముఖులు తనను కలవడానికి వచ్చినప్పుడు.. కేసీఆర్ ప్రధాని అయి ఉంటే… కశ్మీర్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version