మహర్షి టీజర్ అలా ఉంటుందా..!

-

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ తో పూజా హెగ్దె రొమాన్స్ చేస్తుంది. అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇక ఈ సినిమా టీజర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. టీజర్ కట్ ఇప్పటికే పూర్తి అయ్యిందట. దానికి ఆర్.ఆర్, డిటిఎస్ మిక్సింగ్ లాంటివి జరుగుతున్నాట.

మహర్షి టీజర్ లో రెండు మంచి డైలాగ్స్ ఉంటాయని తెలుస్తుంది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు. భరత్ అనే నేను తరహాలో మీడియాతో మాట్లాడే సీన్ కూడా మహర్షిలో ఉంటుందని తెలుస్తుంది. మహేష్ కెరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా మహర్షి ఉంటుందని అంటున్నారు. ఉగాది రోజు వచ్చే టీజర్ ను బట్టి ఓవర్సీస్ డీల్ కుదురుతుందట. మరి మహేష్ మహర్షి టీజర్ ఎలా ఉంటుందో చూడాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version