తెలంగాణ రైతు బంధు వర్సెస్ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి

-

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ముఖ్యమైన వాటిలో ఒకటి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. అంటే ఏం లేదు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు ఉంది కదా. దాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. కాపీ కొట్టి దానికి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని పేరు పెట్టింది. కాకపోతే.. తెలంగాణ రైతు బంధు కిందికి ఈ పథకం రాదు.

ఎందుకంటే కేంద్ర రైతు బంధు పథకంలో సవాలక్ష కండీషన్లు. తెలంగాణ రైతు బంధులో నిబంధనలేమీ లేవు. కేంద్ర రైతు బంధు కింద అర్హులు కావాలంటే.. ఐదు ఎకరాల్లోపే వ్యవసాయ భూమి ఉండాలి. ఒక ఎకరం ఉన్నా.. రెండు ఎకరాలు ఉన్నా.. అర ఎకరం ఉన్నా… కేంద్ర రైతు బంధు ద్వారా సంవత్సరానికి 6 వేల రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయంగా అందిస్తారు. అది కూడా మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. అంటే నాలుగు నెలలకు ఓసారి రెండు వేల చొప్పున మూడు సార్లు ఆరు వేల రూపాయలను చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ప్రస్తుతం 75 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది.

అదే.. తెలంగాణ రైతు బంధును తీసుకుంటే.. నిబంధనలు లేవు. ఎన్ని ఎకరాలు ఉన్నా పెట్టుబడి సాయం అందుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి సంవత్సరానికి 8 వేల రూపాయలను అందిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి 10 వేల రూపాయలను అందించనున్నారు. తెలంగాణలోనూ రెండు వాయిదాల్లో చెల్లిస్తారు కానీ.. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం రైతులకు ఎంతో మేలు చేస్తోంది. పెట్టుబడి లేక వ్యవసాయం చేయని రైతులు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు ఉందన్న ధీమాతో వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కోసం సంవత్సరానికి 15 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. దీన్ని బట్టి.. ఏవిధంగా చూసినా.. తెలంగాణ రైతు బంధు కింద కేంద్ర రైతు బంధు పావు వంతు మాత్రమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version