పెళ్లైనా సమంత ఏమాత్రం తగ్గట్లేదు..!

-

అక్కినేని కోడలిగా సమంత కొత్త జర్నీ స్టార్ట్ చేసి దాదాపు గా రెండు ఏళ్లు కావొస్తుంది. పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న సమంత మునుపటి ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మిస్ గ్రానీ, మజిలి సినిమాల్లో నటిస్తున్న సమంత ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ అండ్ బ్లాక్ లో దిగిన ఫోటో షూట్ ప్రేక్షకులను అలరిస్తుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత బ్లాక్ అండ్ బ్లాక్ పిక్ వైరల్ గా మారింది. ఈ ఫోటోని 5 లక్షలకు పైగా వీక్షించారని తెలుస్తుంది. పెళ్లి తర్వాత గ్లామర్ షో చేయకున్నా తన ఫ్యాన్స్ కోసం సామ్ ఇలాంటి యాక్టివిటీస్ తో ఆకట్టుకుంటుంది. ఇక 96 రీమేక్ లో కూడా ఆమె సెలెక్ట్ అయ్యిందని తెలిసిందే.. తమిళ 96 రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో త్రిష బదులుగా సమంత నటిస్తుంది. 96 తెలుగులో లీడ్ రోల్ గా శర్వానంద్ నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version