బ్రేకింగ్ న్యూస్ : టీడీపీకి షాక్‌.. దేవినేని అవినాశ్ పార్టీకి రాజీనామా..

తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఆ పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి దేవినేని అవినాశ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు చేప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లభించడంలేదన్న అసంతృప్తితో ఉన్న అవినాశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశంపై చర్చించేందుకు బుధవారం రాత్రి గుణదలలోని తన నివాసంలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు పార్టీ మారాలంటూ ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చారు.