చినబాబు చేతిలోనే ఆ సీట్లు…?

-

రాజకీయాల్లో యువత పాత్ర చాలా ముఖ్యం…యువతని ఆకట్టుకున్న పార్టీలకు అధికారం సులువుగా వస్తుని. యువతని ఆకట్టుకోవాలంటే…యువ నాయకులు ఉండాలి. అప్పుడే వారు దూకుడుగా పనిచేసి…యువతని తమవైపుకు తిప్పుకుంటారు. అంత తేలికగా సీనియర్ నేతలు…యువతని తిప్పుకోలేరు. అయితే గత ఎన్నికల్లో జగన్ ఎక్కువమంది యువ నేతలకు సీట్లు ఇచ్చి..యువత ఓట్లు ఎక్కువ పడేలా చేసుకున్నారు. దీని వల్ల వైసీపేకి చాలా ప్లస్ అయింది.

అయితే టీడీపీలో సీనియర్లు ఎక్కువ ఉండటంతో యువత ఓట్లు టీడీపీకి ఎక్కువ పడలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ తర్వాత యువత ఓట్లు పడింది జనసేనకే. పవన్‌కు ఉన్న క్రేజ్ వల్ల యువత ఓట్లు జనసేనకు వచ్చాయి. కానీ టీడీపీకి తక్కువగా పడ్డాయి. కానీ ఈ సారి ఎలాగైనా యువత ఓట్లని ఆకర్షించాలని టీడీపీ ప్లాన్ చేసింది. నారా లోకేష్ నాయకత్వంలో యువ నేతలు దూకుడుగా పనిచేస్తూ వస్తున్నారు.

అలాగే జగన్ ప్రభుత్వంపై యువతకు ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే యువత ఓట్లు పడాలంటే ఖచ్చితంగా యువ నేతలకు సీట్లు ఇవ్వాలి. అందుకే 40 శాతం సీట్లని యువ నాయకులకు ఇవ్వడానికి చంద్రబాబు కూడా రెడీ అయ్యారు. ఇక ఈ సీట్లు అన్నీ చినబాబు చేతులోనే ఉన్నాయని తెలుస్తోంది. చినబాబు సూచనల మేరకే యువ నేతలకు సీట్లు దక్కనున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఉందని తెలుస్తోంది. ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు..40 శాతం యువతకు సీట్లు ఇస్తామని, సీనియర్లు తప్పుగా అర్ధం చేసుకోవద్దని కోరారు. ఇక ఇదంతా చినబాబు డైరక్షన్‌లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలకు పోటీగా యువ నాయకులు రాజకీయం చేస్తున్నారు. చిన్నబాబు సపోర్ట్ చూసుకునే వారు రాజకీయం నడుపుతున్నట్లు తెలిసింది.  వీరిలో బలమైన నాయకులకు సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సీట్లు అన్నీ చినబాబే డిసైడ్ చేయనున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version