చిన్నారి నిండు ప్రాణాన్ని మింగేసిన 5 రూపాయల కాయిన్

చిన్నపిల్లలు ఆడుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… పెద్దలు మరియు ఇతరులు చెబుతున్న కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహిస్తుంటారు. దీని కారణంగా వారు ప్రాణాలు కోల్పోతుంటారు. కొద్ది పాటి నిర్లక్ష్యం వారి ఇంట్లో విషాదం నింపుతోంది. కొన్ని వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఆడుకుంటారు చిన్నపిల్లలు. అయితే అవి కాస్త గొంతులో ఇరుక్కుపోవడం తో… ఊపిరాడక… ఆ పిల్లలు మృతి చెందారు.

అయితే ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది. 5 రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హునసుర్ తాలూకా లో చోటుచేసుకుంది. హునసుర్ తాలూకాలోని ఆయురా హళ్లి గ్రామానికి చెందిన ఖుషి అని నాలుగేళ్ల చిన్నారి… వాళ్ల అమ్మ ఇచ్చిన ఐదు రూపాయల కాయిన్ నోట్లో పెట్టుకుంది. అది పొరపాటున గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. అయితే ఆసుపత్రికి చేరేలోపే ఆ చిన్నారి మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.