‘కాశ్మీర్ ఫైల్’ సినిమాపై రాజకీయం.. చత్తీస్గడ్ లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సంచలనంగా మారింది. ఈ చిత్రంపై అనుకూలంగా.. వ్యతిరేఖంగా కొన్ని వర్గాలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. 1990ల్లో కాశ్మీర్ నుంచి పండిట్లపై కొనసాగిన మారణహోమం, అత్యాచారాలను కథగా తీసుకుని ఈ సినిమాను తీశారు. తమ సొంత ప్రాంతాను వదిలి కాశ్మీరి పండిట్లు ఇతర ప్రాంతాలకు వరసపోయిన యదార్థ ఘటన అధారంగా వివేక్ అగ్ని హోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు టాక్స్ ఫ్రి ఇచ్చాయి. 

ఇదిలా ఉంటే ఈ సినిమాపై చత్తీస్గడ్ లో రాజకీయంలో మాటల మంటలు రేగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను పలు రాష్ట్రాలు పన్ను రహితంగా ప్రదర్శిస్తున్నాయని.. చత్తీస్గడ్ లో 3 థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తున్నారని.. ప్రజలు దీనిని చూడకుండా యజమానులను బెదిరిస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చత్తీస్ గడ్ బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్ మోహన్ అగర్వాల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యతిరేఖమా.. అనుకూలమా అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌మోహన్ అగర్వాల్ అబద్ధాలు చెబుతున్నారని, మా ప్రభుత్వం సినిమాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. సినిమా థియేటర్లలో రన్ అవుతోంది, ప్రజలు తమ ఇష్టానుసారం చూసుకోవచ్చని కాంగ్రెస్ నాయకుడు సుశీల్ ఆనంద్ శుక్లా అన్నారు. నిజానికి వీపీ సింగ్ హాయాంలోనే కాశ్మీర్ లో ఈ పరిస్థితి ఉందని… ఆ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news