బిజినెస్ ఐడియా: వెదురు, గడ్డితో గిఫ్ట్ ప్యాక్స్… నెలకు 2 లక్షలు..!

-

మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా దీని వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మంచిగా సక్సెస్ పొందొచ్చు.

ఒడిశాకు చెందిన చాందిని, ఖండేల్వాల్ కు పర్యావరణం పై ఆందోళన ఎక్కువగా ఉండేది. ఈ ప్లాస్టిక్ వాడకం పై ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారు. అందుకే వాటిని మార్చాలని అనుకున్నారు. రెండేళ్లలో రెండు ట్రాలీల నిండా ప్లాస్టిక్ సంచులు సేకరించారు. వాటిని పడేయకుండా ప్లాంటర్లుగా కొన్ని గృహ వినియోగ ఉత్పత్తులగా మార్చారు.

ఇలా వాళ్లు ఒక సంస్థను ప్రారంభించారు. పర్యావరణానికి అనుకూలముగా ప్యాకేజింగ్ ఉత్పత్తుల్ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. నెలకు రెండు లక్షల ఆదాయం వీళ్ళకి వస్తుంది. చాందిని కి కళలు మరియు చేతి పనులు మీద ఆసక్తి ఎక్కువ. స్థానిక కళాకారులతో కలిసి ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

గడ్డి, వెదురు, తాటి ఆకులు, కాగితపు ఆకులు మొదలైన వాటిని ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు. ఇలా వీటితో ప్యాకేజింగ్ కోసం వాడుతున్నారు. ఏకంగా 20 రకాల ఉత్పత్తులను వీళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్నారు. చూశారు కదా అద్భుతమైన బిజినెస్ ఐడియాని. ఈ బిజినెస్ ఐడియాని కూడా ఫాలో అవడం ద్వారా డబ్బు సంపాదించడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news