మళ్ళీ అదే కాంగ్రెస్ కొంప ముంచుతుంది…!

-

కాంగ్రెస్ పార్టీ తగువులు చిన్నపిల్లల కొట్లాట మాదిరి ఉంటాయని ఒక రాజకీయ పరిశీలకుడు టీవీ డిబేట్ లో ఒక సందర్భ౦లో వ్యాఖ్యానించారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైంది. గెలవడం పక్కన పెట్టి పార్టీ గెలిస్తే నేను ముఖ్యమంత్రి నేను మంత్రి నాకు ఆ శాఖ కావాలి అంటూ తన్నుకోవడం, కనీసం పోటీ విషయంలో కూడా జాగ్రత్తగా లేకపోవడం వంటివి,

కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ పంచాయితీలు చేయలేక చేతులు ఎత్తేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి కాస్త దూకుడుగా వెళ్లి తెరాస కి దీటుగా రాజకీయం చేస్తుంటే మిగిలిన వాళ్లకు కాస్త ఇబ్బందిగా ఉంది. వాళ్ళు చేయడం లేదు చేసే వ్యక్తిని చేయనివడం లేదని అంటున్నారు పలువురు.

కేటిఆర్ దూకుడు ముందు కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది. సీనియర్లు ఆయనకు దీటుగా వెళ్ళలేకపోతున్నారు. అలాంటప్పుడు రేవంత్ లాంటి నేత వెళ్తుంటే ఆయనకు అడ్డు పడుతున్నారు. తమకు ఉన్న పలుకుబడితో స్థానిక నేతలను రేవంత్ కి దూరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్ధులకు వాళ్ళు సహకరిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆ పార్టీ ఓడిపోయిందో ఇప్పుడు కూడా వాళ్ళ చేష్టలతో ఓడిపోయే అవకాశం ఉందనే వ్యాఖ్యలు సొంత పార్టీ కార్యకర్తలే చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news