ఈసీని రద్దు చేయాలంటూ.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన కామెంట్స్

-

కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, గుర్తును శిందే వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా ఉద్ధవ్ ఈసీపై తీవ్రంగా మండిపడ్డారు.  పార్టీ పేరు, గుర్తు విషయంలో ఇంత హడావుడిగా ఈసీ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై నమ్మకం పోయిందని.. ఈసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రభుత్వం నియమించకూడదని, ప్రజలే ఎన్నుకోవాలని పేర్కొన్నారు.

శివసేన పేరును, గుర్తును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గానికి అప్పగించాలన్న ఈసీ నిర్ణయం పూర్తిగా తప్పన్నారు ఉద్ధవ్ ఠాక్రే. పార్టీ పేరు, గుర్తును ఇలా ఒక వర్గానికి ఇచ్చిన సందర్భం లేదని చెప్పారు. శివసేన పార్టీ పేరు, గుర్తులను ఏక్ నాథ్ శిందే దొంగిలించగలరేమో కానీ.. ఠాక్రే పేరును దొంగిలించలేరని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news