టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం

-

హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడుకు మూడు సీట్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. నల్లొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు.

నల్గొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 640 ఓట్లు పోలవగా.. వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 848 ఓట్లు పోలయ్యాయి. ఇక.. రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు వచ్చాయి. నల్గొండలో చిన్నపరెడ్డి 226 ఓట్ల మెజారిటీతో గెలవగా… వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. 827 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పట్నం మహేందర్ రెడ్డి 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version